చేరి కొల్వుడీ - స్తుతించుడీ (85)
చేరి కొల్వుడీ - స్తుతించుడీ - శ్రీయేసుని
కోరిచేరుడి - అర్పించుడీ - కృతజ్ఞతల్
సర్వ భూ ప్రజలారా - సర్వ సృష్టి జీవులారా (2)
1. ఆశ్చర్యకరుడని - ఆలోచన కర్తని
నిత్యుడైన తండ్రని - సమాధానకర్త ప్రభువని
2. పాపశాపహరుడని - పాపికాశ్రయంబని
పరమదైవ నరుడని - పావనాత్మ పూర్ణ ప్రియుడని
3. ఎన్నడైన మారని - యేసు నామధారుని
ఎన్నడు ఎడబాయని - ఇమ్మానుయేలు దేవుని
4. రాజులకే రాజని - ప్రభులకే ప్రభుడని
ఆల్పా ఓమెగని - ఆది దేవ తేజో రూపని