చేయి చేయి కలిపి (84)

  
చేయి చేయి కలిపి - యేసు మనసును కలిగి
మనము మనసులు కలిసి - ఏకమనసును కలిగి
కలసి మెలసి పనిచేదాం - ఏకముగా ప్రార్ధిదాం
కలిమిలోన - లేమిలోన - కలకాలం కలిసుందాం

1. అహం, కులం వదిలేద్దాం - అంతరాలు పూడ్చేదాం
ఒకరి నొకరు యోగ్యులుగా - అందరినీ ఎంచుదాం

2. విలువైన రక్తముతో - కొనబడిన సహవాసం
విభేదాలు విడనాడి - విలువలను నాటుదాం

3. దారుణమగు హింసలలో - ధైర్యంగా నిలబడదాం
హింసకులను క్షమించి - రక్షణకై ప్రార్ధిదాం

0:00
0:00

Audio

0:00
0:00

Track