చల్ల చల్లని గాలి తెమ్మెర (79)
చల్ల చల్లని గాలి తెమ్మెర హో....హో....హో....
కొండ కోనల్లో రుమ్మని పాడగ
మెల్ల మెల్లగ పారే సెలయేరు
పరవళ్లు త్రొక్కుచూ ఉప్పొంగి ఆడగ
పుడమి తనువు పులకించింది
ఇలలో యేసురాజు పుట్టెనని
1. లోకమంత పాపముతో నిండి యుండగా ప్రేమించి పరలోకము వీడి
భూజన దోషములు తనపైన మోసుకొని (2)
మ్రానుపైన మరణించుట కేతెంచినాడని
2. పునరుత్థానుడై మృత్యుంజయునిగా
మహిమాత్ముందై ఇలలో నిలచి
విశ్వసించినచో దోషములు క్షమియించి (2)
నిత్యజీవ మొసగుటకు ఈభువి కేతెంచెనని
3. మేఘ వాహనుడై సింహగర్జనతో వేవేల దూతలతో ఏగి
నూతన యెరుషలేము ధరపైన స్థాపించి (2)
నీతి న్యాయములతోడ తననేల బోవునని