అనుదినం నిను ధ్యానింతుము (7)
అనుదినం నిను ధ్యానింతుము
అనుక్షణం నిను స్తుతియింతుము
నీవే అండగా నీ తోడుండగా
ప్రేమించి ప్రార్ధించి పని చేసెదం
1. ప్రథమము ప్రభువని ప్రస్తుతిన్ చేసెదం
నీ పరిపూర్ణ పరిశుద్ధ మార్గం
పయనించుటే మాకు జీవం
2. వాక్యము ధ్యానము మరువక చేసెదం
నీ దివ్య మధురంపు వాక్యం
ధ్యానించుటే గొప్ప భాగ్యం
3. ప్రభుపని చేయుచూ రయమున వెళ్ళెదం
నీ సువార్త చాటింతుం నిత్యం
ప్రకటించి నీ ప్రేమ సత్యం
4. నశించు ఆత్మలన్ విడువక గెలిచెదం
నీ కృపచేత కరుణించి మమ్ము
నీ పరిచర్యనే చేయనిమ్ము
5. శ్రమలలో మనసులో సంతసం పొందెదం
ఆ దాతృత్వ పరిచర్యన్ మేము
సాగింప సామర్థ్య మిమ్ము