కాలేజిలో చేరాను - లేజీగా మారాను
నామోజు తీరిందిగా - బూజెంతో చేరిందిరో
బాసు - చదువంతా లూజయిందిరొ
చికభం చికభం చికభం
లలలా లలలా లలలా
1. రాగింగ్ చేశారు నన్ను - రోజంతా తిన్నారు
బాదారు నన్ను - మనసంతా గాయాలు
చెలరేగిన తాపాలు - చెడిపోయిన భావాలు మిగిలాయిరో (2) ||చికభం||
2. అలవాటు చేశారు మందు - ఆపైన నేర్పారు
గుట్కా పసందు - మతిలేని మాటలెన్నో
అతివాగుడు పేలాపనలే - గతితప్పిన
సావాసాలే మిగిలాయిరా(2) ||చికభం||
3. కవ్వించే అందాలు చూసి - రంగేళి
హంగులెన్నో నేర్పాను నేను - పోటీలో
ఓడాను - నాటీగా మారాను - ఆపై గలాటాలు మిగిలాయిరా (2) ||చికభం||
4. భవిష్యత్తు నాకింకా లేదు - బాధలతో
బ్రతుకంత బహు భారమాయె - మనశ్శాంతి
కావాలి - సంతోషం కావాలి - బ్రతుకంతా నెమ్మదిగా గడపాలిరా (2) ||చికభం ||