కలసి జీవించెదం కలసి పనిచెసెదం
కలసి ప్రార్ధించెదం - మాదేవా
ఎంతో గొప్పమేలు ఎంతో మనోహరము
ఎంతో ఆశీర్వాదం - ఏకత్వం
ఆరాధించి ఆనందింతుము
కృపా సత్య సంపూర్ణుడా
కలసి మెలసి సేవింతుము
అలసిపోము నీదు కృపలో
1. సహవాస ప్రేమ - దైవ ప్రేమ
అక్కరలు తీర్చి - ఆదరించును
లోపంబు మన్నించి - సవరించి
వెలుగులో నడిచి - వెలిగించును #ఆరాధించి#
2. నీ ద్రాక్షతోటలో - పనిచేసి
నీ ప్రేమ బాటలో - వెంబడించి
నీ వార్త చాటుచు - పరిగెత్తి
నీ స్తుతి పాటతో - జయించెదం #ఆరాధించి#
3. ప్రార్ధించి పోరాడి - గెలిచెదము
విజ్ఞాపనాత్మతో - విమలాత్మతో
నీదు సంకల్పం - నెరవేర
నీ హస్తం కదిలి - పనిచేయగా #ఆరాధించి#