కన్నులెత్తి పైరుల చూడు (57)
కన్నులెత్తి పైరుల చూడు - కోయగ లేరెవ్వరు
ఓ యువకుడా ఓ యువతీ - తినుచు త్రాగుచు సుఖింతువా?
1. పట్టణము ప్రాకారములు - కాల్చబడి కూల్చబడెన్
పరరాజు పాలనలో - పరిచర్య పావనమా?
ఓ యువకుడా ఓ యువతీ - తినుచు త్రాగుచు సుఖింతువా?
2. మందిరము పడియుండ - మందుడవై నీవుండి
సరంబీ గృహములలో - సంతోష సమయమిదా
ఓ యువకుడా ఓ యువతీ - తినుచు త్రాగుచు సుఖింతువా?
3. యుద్ధమున ప్రజలంతా - పెద్దగను సిద్ధపడన్
ప్రొద్దు గ్రుంకిన వేళ - మిద్దెపయిన్ తిరిగెదవా?
ఓ యువకుడా ఓ యువతీ - తినుచు త్రాగుచు సుఖింతువా?
4. ద్రవ్యమును వస్త్రములు - తోటలకు సమయమిదా?
సర్వమును ప్రభుకిచ్చి - సాగెడి ఈ సమయమున
ఓ యువకుడా ఓ యువతీ - తినుచు త్రాగుచు సుఖింతువా?