ఒకే ఒక మార్గం (43)

  
ఒకే ఒక మార్గం - ఒకే అధారము
ఒకే పరిహారము - లేదు వేరే మార్గం
క్రీస్తేసే మార్గం - విడువుము నీ మార్గం

1. లోకం మాయరా - పాపం వీడరా
నీ హృదయమెంతో - బలహీనమంత
పడదారి చూపురా - పరికించి చూడుమా

2. రక్తం చిందెరా - సిలువలో చూడరా
నీ పాపములకు ప్రభుయేసు రక్తం - పరిహారమాయెరా క్షమభిక్ష వేడరా

3. మరణం గెలిచెరా - మార్గం జూపెరా
మహిలోని మనిషి - మహిమాత్మ నొంద
యెదలోనే నిలుచురా - మదినంత నింపురా

4. సమయంలేదురా - సత్యమే సోదరా
రారాజు త్వరలో - రాబోవుచుండె
రక్షణను కోరుమా - రయముగను చేరుమా
0:00
0:00

Audio

0:00
0:00

Track