అందాల ఆశాకిరణం - డెందాల చీకటి బాపెన్
ఉదయించె చూడు సదయుండు యేసు - నిజ సంతస క్రిస్మస్ నేడు
1. యువతర భవితవ్యం యేసే - నవతర చైతన్యం యేసే
ప్రభవించెను దివిరాజ్యం ధరలో - ప్రభువిచ్చెను శుభసందేశం.
2. దరిలేని దూరాలలో - గురిలేని వలయాలలో
తిరుగాడు మానవులకుతోడై - భరియించున్ పలు భారములన్.
3. అరుణోదయ దర్శనమిదియే - అసమాన తేజోమయుడే
అరుదెంచెను ఆశ్చర్యకరుడై - అందించెను అద్భుత ప్రేమన్.