ఉన్నపాటున వచ్చుచున్నాను (33)
ఉన్నపాటున వచ్చు - చున్నాను నీ పాద - సన్నిధికో రక్షకా
యెన్న శక్యము గాని పాపము - లన్ని మోపుగ వీపు పైబడియున్న
విదె నడలేక తొట్రిలు - చున్నవాడను నన్న దయగను
1. కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీ శరీర రక్తము చిందుట - భూరి
దయతో నన్ను నీ దరిం - జేర రమ్మని పిలుచుటయు ని-ష్కారణపు
నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నాయెడ
2. మసి బొగ్గువలె నా మా - నసమెల్ల గప్పెదో - ష సమూహములు
మచ్చలై - అసితమగు ప్రతి డాగు తుడువను - గసటు గడిగి పవిత్ర
పరపను - నసువులిడు నీ రక్తమే యని మసలకిప్పుడు సిలువ నిదెగని
3. వెలపట బహు యుద్ధములు - లోపటను భయము గలిగే నెమ్మది
దొలగెను పలువిధములగు సందియంబుల - వలన బోరాటములచే
నే నలసి యిటునటుంగొట్టబడి దు - ర్భలుడనై గాయములతో నిదె
4. కడు బీదవాడనం - ధుడను దౌర్భాగ్యుడను - జెడిపోయి పడి
యున్నాను - సుడివడిన నామదికి స్వస్థత - జెడిన కనులకు దృష్టి
భాగ్యముం - బదయవలసిన వన్ని నీచేం బదయుటకు నా యొదయడా యిదె