స్వేచ్ఛ నీదే - మనసు నీదే (315)

  
స్వేచ్ఛ నీదే - మనసు నీదే - నిర్ణయం నీదే
వయసు నీదే - బలము నీదే - అనుభవించుము జీవితం (2)

క్రీస్తులో స్వతంత్రం సరళం శాశ్వతం - ప్రభువులో ఆనందం ఎన్నడు తరుగదు (స్వేచ్ఛ)

1. ఆనందం ఆహ్లాదం - ఎన్నడు తగ్గనియ్యకు
అన్నిటిని అనుభవించు - జీవించు వుల్లసంగ (2)
తీర్చున్నదని మరువకుము - యోచించుకో నీ భావితవ్యం (2) (స్వేచ్ఛ)

2. ఆధము హవ్వయును - స్వేచ్ఛగా జీవించిరి
శోధనకు లొంగి యిల - మరణము తెచ్చుకొనిరి (2)
తప్పు నిర్ణయం స్వేచ్ఛను - హరించెను విలపించిరు (2) (స్వేచ్ఛ)

3. యేసునందు నిజమైన - స్వతంత్రం వున్నది
సాతాను ఆశచూపు - పాపపు భనిసత్వమే (2)
క్రీస్తు ఇచ్చు నిజ స్వేచ్ఛలో నిలువుము ఈ క్షణమే (2) (స్వేచ్ఛ)
0:00
0:00

Audio

0:00
0:00

Track