హేతువు లేని ప్రేమ (314)

  
హేతువు లేని ప్రేమ - యేసు కల్వరి ప్రేమ
హేయమైన ఘోరపాపిని - హేతువడుగని ప్రేమ

1. నింపాను హృదయాన్ని పాపముతో
మోసాను మోసాన్ని భారముతో
మోయలేని - పాపభారం (2)
మోసి శాంతి నిచ్చిన ప్రేమ

2. బతికాను పాపాంధకారములో
కృంగాను అపరాధ భారముతో
అలసి చెదిరిన - జీవితానికి (2)
సేద దీర్చిన ప్రేమ

3. నడిచాను సాతాను బాటలో
జారాను వ్యసనాల ఊబిలో
గమ్యమెరుగని - జీవితానికి (2)
దారి చూపిన ప్రేమ

4. త్రోసాను నా యేసు ప్రేమను
కోరాను ఈ లోక ప్రేమను
ఓడిపోయిన - జీవితానికి (2)
జయమునిచ్చిన ప్రేమ

0:00
0:00

Audio

0:00
0:00

Track