హృదయం వెలిగించు దేవా (313)
హృదయం వెలిగించు దేవా - నీ కొరకు ప్రకాశించునట్లు
మండుచు ప్రకాశించెదం - రక్షణ వార్తను చాటించెదం
1. కారు చీకటిలో - కాంతి రేఖ వలె
అన్య జనములలో - ప్రభుని కార్యములు
అనుదినం - చాటించెదం - అవనికి వెలుగు - యేసేనని
2. భవిత బెదిరించినా - దిగులు వెధించినా
ప్రతిభ అంతటినీ - ప్రభుకే అర్పించెదం
ఎల్లలు లేని ప్రభు ప్రేమను - ఎల్లలు దాటి ప్రకటించెదం
3. పండిన పొలములలో - కోత పాటలను
ఎండిన బ్రతుకులలో - జీవజలములను
ప్రవహింపజేయను - ప్రార్ధించెదం
నూతన గీతాలు కీర్తించెదం