స్తుతింతుము నిరతం - నీ చరితం
భజింతుము కరముల్ - జోడింతుము
సదాకాలం నిన్నే - పూజింతుము
స్తుతి పాత్రుడవు - యేసురాజ
హల్లెలూయ - హల్లెలూయ
1. సంపూర్ణ ప్రేమకు మూలమైన దేవా
సంపూర్ణులగుటకు బలమిచ్చు దేవా
నిత్య సంకల్పం నెరవేర్చు దేవా
నిత్యము మమ్మిల నడిపించు దేవా #హల్లె#
2. అనాధలందరి నాదరించువాడ
అన్నార్తుల నిల పోషించువాడ
బంధితులను యిల విడిపించువాడ
బాధితులకు నీ న్యాయమిచ్చువాడ #హల్లె#
3. దయాకిరీటం ధరనిచ్చితివి
దోషపు ఫలమును తొలగించితివి
నూతన యవ్వన బలమొసగితివి
నూతన సంతస మేలొసగితివి #హల్లె#