ఇది నిజము యేసు జననం, ఈ ధరలో ఇది చరితం
1. ప్రవచించిరి ప్రవక్తలు యేసుడు ఇలలో పుడతాడని
ఆ వచనముల నెరవేర్పుగా (2) యేసు డరుదెంచెను మనకై
2. మరణించెను, మరిలేచెను జీవముతో, జీవమిచ్చుటకై
ఎవరాయనను నమ్మెదరో (2) వారును జీవమొందెదరు
3. పరమెళ్లెను, మరి వచ్చును తనవారిని తీసికెళ్ళుటకై
వరుసగా మృతులు లేచెదరు (2) నమ్మినవారు వెళ్ళెదరు