విద్యార్ధి నాయకుడా విమలాత్మ సేవకుడా
సద్ధర్మ వారసుడా - సందేశ పాలకుడా
1. లోతైన ఆత్మీయత - ప్రభు యేసుతో ఐక్యత
ఆత్మీయ పోరాటమే - ప్రభు యేసులో జయమే
2. అడుగు పెట్టి నీవడుగుము - కళాశాలల్ కదిలించుము
జడియకు బలమొందుము - పరిశుద్ధ ప్రభు సన్నిధిలో
3. జయశాలివై నిలువుము - నిబ్బరముగా నుండుము
ప్రభువే నీతోడుగా - ప్రభువే నీ జయముగా
4. వాక్యంబు ధ్యానించుము - బోధించి నెరవేర్చుము
వర్ధిల్లెదవు నిత్యము - చక్కగా చరియింతువు