యేసుని ప్రేమ - యేసువార్త (254)
యేసుని ప్రేమ - యేసువార్త వాసిగ చాటగ వెళ్ళుదము
ఆళతో యేసు సజీవ సాక్షులై దిశలన్నిటను వ్యాపించెదము
వినుము ప్రభుని స్వరము (2)
ప్రభుయేసు సన్నిధి తోడురాగా - కడదూర తీరాలు చేరెదము

1. మరణచ్చాయ లోయలలో - నాశన కూపపు లోతులలో (2) చితికెను బ్రతుకులెన్నో (2)
ప్రేమ తోడను చేరి వారిని - ప్రభుయేసు కొరకై గెలిచెదము

2. కాపరి లేని గొర్రెలుగా - వేసారెనుగ సమూహములే (2) ప్రజలను చూచెదమా (2)
ప్రేమతోడను చేరి వారిని - ప్రభుయేసు కొరకై గెలిచెదము

3. లేలెమ్ము రారమ్ము - మాసి దోనియుని పిలుపదిగో (2) వేగమె వెళ్ళుదము (2)
ప్రేమతోడను చేరి వారిని - ప్రభుయేసు కొరకై గెలిచెదము

4. తెలియనివారు చూచెదరు - వినలేనివారు గ్రహించెదరు (2) వాగ్గాన మూలముగా (2)
క్రీస్తు నామము యెరుగని వారికి - ప్రభుయేసు ప్రేమను చాటెదము
 0:00    
  0:00

Audio

 0:00    
  0:00

Track