యేసుతో సాగిపో - యేసులో (250)

  
యేసుతో సాగిపో - యేసులో నిలిచిపో
యేసుని సిలువ విలువ తెలియజేయుమా
యేసురాజు ముందు నడువగా - నీతి రాజ్యం స్థాపించుమా

1. కొండలైన లోయలను - ఎండమావి మాయలైనను
నిండు మనసుతో వెంబడించుమా సిలువ బలము నీకు తోడుగా

2. శ్రమయు బాధ - హింసయైనను - కరవు వస్త్రహీనతైనను
ఉపద్రవములు ఖడ్గమరణముల్ - సిలువ ప్రేమన్ తొలగజేయునా

3. దేని గూర్చి చింతపడకుము - చెంతజేరి విన్నవించుము
కృతజ్ఞతతో ప్రార్థించుము - దైవశాంతి నీకు తోడుగా

0:00
0:00

Audio

0:00
0:00

Track