యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా (246)

  
యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము
మనమందరము ఆయన సేవను - ఏకమై సదా జేసెదము
మన యేసు ప్రభువు - శీఘ్రముగా వచ్చును
అతి వేగముగా సేవ చేతుము -
యేసుక్రిస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము

1. అందరి యెడల ప్రేమ జూపెదం - యేసు చెంతకు పిలిచెదము
అతి శీఘ్రంబుగ ఉత్సాహంబుతో - రాజమార్గమును చూపెదము #మన#

2. సాతాను దుర్గమును పడగొట్టి - యిక యేసుకొరకే జీవింతుము
ఈ లోకమంతటిన్‌ - ప్రభు యేసు నామమున్‌
ఎల్లవేళలందు చాటెదము #మన#

3. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే
ఇక జీవించుట తన కొరకే
అని నిశ్చయించుచు - అందు నిలిచియుండి
ప్రభు దినమందు హర్షింతుము #మన#

0:00
0:00

Audio

0:00
0:00

Track