ఆహా మహానందమే (23)

  
ఆహా మహానందమే ఇహ పరంబులన్ మహావతారుండా
మా యేసు జన్మదినం హల్లెలూయా

1. యెహోవా తనయ యేసుప్రభు
సహాయుడా మా స్నేహితుడా
ఇహ పరంబులకు ఇమ్మానుయేలు
మహానందముతో నిన్నారాధింతుము
నిన్నారాధింతుము హల్లెలూయా

2. కన్యక గర్భమందు పుట్టగ
ధన్యుడవంచు దూతలెందరో
మాన్యులు పేద గొల్లలెందరో
అన్యులు తూర్పు జ్ఞానులెందరో
నిన్నారాధించిరి హల్లెలూయా

0:00
0:00

Audio

0:00
0:00

Track