మా యేసు - మా ఆశ (229)

  
మా యేసు - మా ఆశ మా రాజా - మా తేజ
మా దేవా - మహాదేవ జీవాధార - మా కరుణాధార
ఘనతా మహిమ నీకే స్తుతి ఆరాధన నీకే
ఇహపరములలో నీకే తరతరములలో నీకే

1. రక్షించావు - విడిపించావు అక్షయ కృపనిచ్చి - నడిపించావు
పోషించావు - క్షేమమిచ్చావు రక్షకుడా - నీ రాజ్యమిచ్చావు

2. అద్వితీయా - ఆదిదేవా ఆత్మీయ సహవాసం - అందించావు
అద్భుతమే - ఆనందమే అసమానుడా - అభిషేకమిచ్చావు

3. నీ జనులమే - నీ స్వాస్థ్యమే నీ తనువుగా - యిల నిర్మించావు
యాజకులమే - రాజ్యమేలెదం రారాజుతోడనే - రమ్యముగా

4. ప్రకటించెదం - ప్రభుప్రేమనే పరలోక ఆనందం - పంచెదము
ప్రభువే మార్గం - ప్రభువే సత్యం ప్రభువే జీవం - అని చాటెదము

0:00
0:00

Audio

0:00
0:00

Track