మహిమాన్విత యేసూ - మహాఘనుడా
మనుజావతారా - మనోహరుడా
మరణించితివి - మృత్యుంజయుడా
మారనాత - నీకే స్తోత్రం ప్రభువా
1. నా ఆత్మలో బలము - నా పాటలో మధురం
నా మాటలో జీవం - నీవేనయ్యా
నీ ప్రేమ నిచ్చి - నను - కరుణించితివి
నీ రక్త క్రయ ధనముతో - రక్షించితివి
పరిశుద్ధ పరచి - నీ ప్రేమ నింపి
నీ సోత్తుగ నను జేసి - దీవించితివే
2. నిందను తొలగించి - బంధాలు తెంపి
డెందములో నీ అందం - పొందుగ నింపి
కృపా మహదైశ్వర్యం - అందించితివి
నిందారహితునిగా - నను - కరుణించితివి
నిర్ధోషమార్గం - నూతనమగు హృదయం
నిను నేను సేవింప - ఏర్పరచితివే