భావితరానికి భాటగా లేవాలి నీ సాక్ష్యం
నవతరానికే నాందిగా రావాలి నా సాక్ష్యం
దేవుని గొప్పకార్యములన్ని యువతరమంత గ్రహించాలి
దేవుని హస్తబల ప్రభావముల్ సమాజమును కదిలించాలి
1. ఎర్ర సాంద్రమును చీల్చెను - మరణ నదిని దాటించెను
పునరుత్థాన బలమిచ్చి చూడు - ఎంతో గొప్ప దేవుడు నేడు
2. తరముల సంతానము - వివరంబు నిను కోరగా
తనరారు నీ సాక్ష్యమేగా - వివరించి బలపరచుగాదా
3. జ్ఞాపకాలు స్టాపించుము - ఆనవాళ్లు అందించుము
మౌలికాలు స్థిరపరచుము - మాదిరి బలపరచుము
4. ఉప్పువలె జీవించుము - తప్పులన్ని సవరించుకో
వెలుగువలె వ్యాపించుము - విశ్వనేతన్ చూపించుము
5. సాక్ష్యజీవం కాపాడుకో - యేసు ప్రేమకై వేడుకో
అక్షయుడు శ్రీ యేసుడే - రక్షణని ప్రకటించుము