ప్రభు పనిలో నిలచి (205)

  
ప్రభు పనిలో నిలచి యుండి - స్థిరముగ కొనసాగెదమా
ప్రభు మనసును కలిగి యుండి - ఆసక్తితో వెళ్లెదమా
హల్లెలూయా జయస్తోత్రం - జయశాలి జయమిచ్చును
హల్లెలూయా జయస్తోత్రం - ప్రయాసకు ఫలమిచ్చును

1. తన తోటలో పనిచేయన్‌ - తన పిలుపును మనకిచ్చిను
వినయముతో లోబడెదం - విడువక పని చేయుదుము (హల్లె)

2. తన పనికై మీనాలన్‌ - విరివిగను వాడెదమా
కొంచెములో నమ్మకము - కొంతైనా చూపెదము (హల్లె)

3. సిగ్గుపడ నక్కరలేని - యోగ్యులముగ కనబడుదాం
జతపనివారము మనము - ప్రభువుతో సమకూర్చెదము (హల్లె)

4. స్వార్ధముకై ప్రభుపనిని - పాడుచేయక భయపడుదాం
మన కక్ష విపక్షములన్‌ - దహించును దైవాగ్ని (హల్లె)

5. ప్రభు రాకడ సామీప్యం - ప్రభుపనికై త్వరపడుదాం
మన భేదములను మరచి - ఐక్యతతో సాగెదము (హల్లె)
0:00
0:00

Audio

0:00
0:00

Track