పాపాల భారంబు మోసి - పరితాప మొందేటి ప్రజల
ప్రభుయేసు రమ్మని పిలిచె - పరిపూర్ణ విశ్రాంతి నీయ
1. లోకాశలకు నీవు లొంగి - లోలోన కుములుచు కృంగి
ఎదలోన ఎండి నశించి - ఎదుగేమి లేక కృశించి
ప్రభు యేసు పిలుచుచు నుండ - పరితృప్తి నొందలేవా
2. జీవించ నీవు వేసారి - పయనించు ఓ బాటసారి
ఇంకెంత కాలమీ బ్రతుకు - ఇకనైన తీరని బరువు
నీ భారమంతయు మోసి - విశ్రాంతినీయు నేసు