పాపానికి జీతం మరణం - పాపికి యేసే శరణం
యేసుని శరణం - కలుషిత హరణం
యేసు జయించె మరణం
1. నిన్నటి దినము రాదు - రేపు నీ సొంతము కాదు
చేరుము యేసుని నేడు - వీడుము పాపపు జోడు
2. వినవోయి యేసుని మాట - కనవోయి ప్రగతికి బాట
వీడుము పాపపు బాట - పాడుము యేసుని పాట
3. అందుకో యేసుని చేయి - పొందుము ఆత్మలో హాయి
యేసుని చెంతకు చేరి - ఆత్మఫలములు కోయి