పరిశుద్ధుడా - పరిపూర్ణుడా (197)

  
పరిశుద్ధుడా - పరిపూర్ణుడా పరలోక తేజ - పరమోన్నతా
యేసూ - మా ప్రియుడా ప్రభువా - పరిశుద్ధ ఫలముల నిమ్ముదేవా

1. నీ అర్పణెంతో పరిశుద్ధము నీ జీవవాక్యం పరిశుద్ధము
నీ రక్తధారలు పరిశుద్ధము నీ ఆత్మనామం పరిశుద్ధము

2. పరిశుద్ధ పిలుపుతో పిలిచితివి పరిశుద్ధులనుగా తీర్చితివి
పరిశుద్ధ ఫలములు కోరితివి పరిశుద్ధ వరములనిచ్చితివి

3. శరీర కార్యముల పవిత్రముల్‌ శరీమెంతో బలహీనము
శరీరమే నీ ఆలయము శరీరమే సజీవయాగము

4. పరిశుద్ధులముగా జీవింతుము పరిశుద్ధ సాక్ష్యము నిలిపెదము
పరిశుద్ధ స్వాస్థ్యము పొందెదము పరిశుద్ద క్రీస్తుని చూపెదము

0:00
0:00

Audio

0:00
0:00

Track