పరిశుద్దముగ యిల (194)

  
పరిశుద్దముగ యిల జీవించెదా
పవిత్ర పరచుకొందు నాదేవా
పరలోక తేజ యేసు రాజా
హోసన్న స్తోత్రం హల్లెలూయా
పరిశుద్ధాత్ముడా కడుగుమా
ఆత్మలో బలమిచ్చి బ్రోవుమయ్యా

1. అజ్ఞాన దశలోని ఆశలన్నియు
విజ్ఞానదశలో విడువనైతిని
పరిశుద్ధ పిలుపును మరచితిని
ప్రవర్తనంతటిలో నిన్ను పోలి నడిచెదా

2. లోకాశలన్ని కూడ లాగుచుండగా
లోనున్న కోరికలు పైకిలేవగా
లోకాధికారి నాపై రేగుచుండగా
లోపంబులేని రక్తశుద్ధి నాకిమ్మయ్యా

3. నీ ఆత్మతో నేను ఏకమైతిని
నీలోనే తీగెలా కలిసిపోతిని
నీతోనే సిలువలో మరణమైతిని
నీవంటి పరిశుద్ధతను నేకోరెద

4. నా దేహమంత నీ ఆలయముగ
నా హృదయమంత నీ ప్రేమనిండగ
నామనసే నీదు సింహాసనముగ
పరిశుద్ధయాగముగ నీకు లోబడెద

0:00
0:00

Audio

0:00
0:00

Track