పరిశుద్ధ దేవా - పరలోక నివాస (193)
పరిశుద్ధ దేవా - పరలోక నివాస
పాడెద స్తుతి నీకే - పరమ దూతలతో
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
1. సెరూపులు నిన్ను సేవించె - కెరూబులు నిన్ను కొలిచె
సకల పరిశుద్ధులు - నిన్నె సదా స్తుతియింతురు (2) #హల్లెలూయా#
2. నాలుగు జీవులు నిన్నావరించె - ఇరువది నలుగురు సాగిలపడిరి
నీ మహిమ ప్రకాశించగా - పాడిరి స్తుతులతో సర్వాధికారనుచు #హల్లెలూయా#
3. పాపమును కనలేని దేవా - పవిత్ర కన్నులుకలిగిన ప్రభువా
పరిశుద్ధులు మము చేయును - పరమును వీడి ధరకేగితివా #హల్లెలూయా#
4. నీవు పరిశుద్ధ ప్రభువైయుండి - మము శుద్దులుగా నివసింపగోరి
మా శుద్ధ హృదయాలతో - నిన్నారాధించమని కోరితివి #హల్లెలూయా#
5. పరిశుద్దుడిగా నిర్దోషిగా - ధర నిలిచిన పరిపూర్ణ ప్రభువా
పరిశుద్దునిగా పాపిని - ధర నిలిపే దేవా మా రక్షకా #హల్లెలూయా#