పరమందలి దేవా, పరిశుద్ధ ప్రభువా, యేసయ్యా, స్తోత్రమయా
నేరమెంచక మము చేర్చుకొంటివి, పరిశుద్ధముగా జీవించమంటివి
1. పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, సరిరారు నీకెవరూ ఓ యేసయ్యా
అరికాలు మొదలు నదినెత్తి వరకు (2) పాపముండగా మమ్ము శుద్ధీకరించితివి (2)
2. సరిచేసితివి నీవు మా జీవితముల, విరబూసె మాలోన పరమానందం
గురిలేని మాకు పరిశుద్ధత నిచ్చి (2) పరిపూర్ణతను మాకు గురిగా నిచ్చితివి (2)
3. చిరకాలములో మేము నీతో నుండ సరిపోయెడు పరిశుద్ధత మాకీయుమయా
స్థిరమైన మనస్సు, నిను పోలిన బ్రతుకు నరశరీరధారీ, మాయేసూ మాకిమ్ము