నీవే యేసయ్యా నీవేనయ్యా (177)
నీవే యేసయ్యా నీవేనయ్యా
మరణము గెలిచిన వీరుడ నీవయ్యా
1. పునరుత్థాన బలము నీవే
మరణపు బలుని గూల్చి గెలిచావు నీవే
మరణపు ముల్లును విరిచావు నీవే
మరణపు దాస్యపు భయమును బాపితివి
2. మరణ బలమును వ్యర్థము చేసి
వెలిగించితివి జీవాక్షయతల్
మరణ శరీరరము మహిమను దాల్చగ
మహిమైశ్వర్యము మనుజులకిచ్చితివి
3. అక్షయ జీవం అందించావు
అనుదిన జీవిత జయమిచ్చావు
పాపపు నియమము తొలగించావు
ఆత్మ నియమముతో మము కరుణించితివి