నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
చింత పడము మానకాపు మానము - యేసు కృప చాలును
1. పాపం పోయెను హల్లెలూయ - యేసు లేచెను హల్లెలూయ
యేసు వచ్చెను హల్లెలూయ - స్తుతి గీతములు పాడుదము
2. యేసే మార్గం హల్లెలూయ - యేసే సత్యం హల్లెలూయ
యేసే జీవం హల్లెలూయ - యేసువార్త చాటుదమా
3. వాక్య ధ్యానంతో హల్లెలూయ - ప్రార్థనాత్మతో హల్లెలూయ
ఏకత్వంతో హల్లెలూయ - సహవాసం కోరుదమా
4. యేసు కొరకై - జీవించుదాం - యేసు వెలుగును చూపించుదాం
యేసు ప్రేమను - అందించుదాం - సాక్ష్య జీవితం చూపుదాం
5. ఆత్మల కొరకై - వేడెదము - ఆత్మ నడుపగా - వెళ్ళెదము
ఆత్మబలముతో సాగెదము - ఆత్మనాధుని సేవింతుము