నీ జీవితం విలువైనది (162)
నీ జీవితం విలువైనది ఏనాడు ఏమరకు
శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా
ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను ప్రేమించెను
నా నేస్తమా తెలిసికో
ప్రభు యేసు నీకై మరణించెను
1. బలమైన పెను గాలి వీచి-అలలెంతో పైపైకి లేచి (2)
విలువైన నీ జీవిత నావా-తలకిందులై వాలిపోవ
వలదు భయము నీకేలా-కలడు యేసే - నీ తోడు
యేసు మరణించి మరి లేచెను-నిన్ను ప్రేమించి దరి చేర్చును
2. గాఢాంధకారంపు లోయలో- వడగాలి వడి సవ్వడిలో (2)
నడయాడి నీ జీవిత త్రోవా-సుడివడి నీ అడుగు తడబడెగా
వలదు భయము నీకేలా-కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను-నిన్ను ప్రేమించి దరి చేర్చును
3. కనలేని గమ్యంబు కోరి-ఎనలేని కష్టాల పాలై (2)
మనలేని నీ జీవిత గాథా-కలలన్ని కన్నీటి వ్యథలే
వలదు భయము నీకేలా-కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను-నిన్ను ప్రేమించి దరి చేర్చును