నీకే స్తోత్రములు దేవా (158)
నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు
సౌఖ్యములో దు:ఖములో.... సౌఖ్యములో దు:ఖములో
నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు
1. కన్నీటితో కడిగి నీ పాదముల్
నేకుమ్మరించాను నా హృదయమున్
దోషిని నను కరుణించినావు (2)
నీదు ప్రేమతో నను నింపినావు (1)
2. హిస్పోపుతో కడిగి నాపాపము
పవిత్ర పరచావు ఈ దేహము
హిమము కంటెను మెరిపించినావు (2)
నీదు రక్షణ కురిపించినావు (1)
3. కన్నుల్లో కదిలెను నీరూపమే
మనసున మెదిలెను నీ వాక్యమే
ఎంత మధురం నీ నామ స్మరణం (2)
ఎంత మధురం నీ నామ స్మరణం (1)
4. నలిగిన హృదయం నీ కోసమే
విరిగిన మనస్సు నీ కిష్టమే
మరువలేనూ నీ దివ్య ప్రేమన్ (2)
మరువలేనూ నీ దివ్య ప్రేమన్