నిలకడగా కొనసాగెదమా (156)

  
నిలకడగా కొనసాగెదమా
పరిశుద్ధ లేఖనములయందు
అలయక అనుభవ జ్ఞానముతో
పలువిధముల ఫలియించెదమా

1. ఆత్మ ప్రేరితము - దైవాత్మ శక్తి పూరితము
నిత్యము వెలుగును ప్రసరించున్‌ - ఇల
సత్యపు బాటలో నడిపించున్

2. ఆదియందలి వాక్యం - శరీరధారిగ వేంచేసెన్‌
ఆత్మఖడ్గము విభజించున్‌ - యిక
అపవాదిని - ఎదిరించెదమా

3. ఉపదేశించెదము - ఖండించి తప్పును సవరించి
అపవిత్రతను విడనాడే - నిజ
నైతిక విలువలు నేర్పెదమా

4. వినుటకు వేగిరము - అంగీకరించెడి సాత్వికము
అనుదిన వాక్యపు ఆచరణే - మన
ధన్యత భాగ్యం - ఈ ధరలో

0:00
0:00

Audio

0:00
0:00

Track