నిను పిలిచిన వాడగు యేసు నాధుడు పరిశుద్దుడు
బలపరచిన వాడగు యేసు నాధుడు పావనుడు
కొనసాగెదవా? - ప్రభు యేసునిలో
పరిశుద్దునిగా - జీవించెదవా?
1. నేర్పరి యేసుడెగా - నిను రూపించెనుగా
పాపపు పంకిల తావుల నుండి - నిను విడిపించెనుగా #కొన#
2. యేసుని సాక్షిగను - నిన్నే కోరెనుగా
ఏ స్థితికైనను చాలినవాడు - నీ ప్రియుడేసుడెగా #కొన#
3. లోకము నందునను - నశించు ఆత్మలకు
పాప పంకిల జీవితాలకు - యేసును చాటెదవా? #కొన#
4. సజీవ యాగముగా - అర్పణ చేసెదవా
ఉత్తమము అనుకూలమును - ప్రభు చిత్తము చేసెదవా #కొన#