నింగినేల మారినా - మారని వాక్యం
సూర్య చంద్రులు గతించినా - ఆరని దీపం
కాలము చెల్లని సత్యం
ఎన్నడు తరుగని జీవం
1. మదిని నెమ్మది లేని వేళలో వాక్యమే - గీతం
నిదుర రాని - నిశీథ రేయిలో - తోడు నీ వాక్యం
దివారాత్రులు - ధ్యానించెదను
పూర్ణమనసుతో - పాటించెదను
2. అశ్లీల అవినీతి - నిండిన జగతిలో
వాక్యమే ఆ మార్గం
అపవాది వంచన - అంచులలోన
వాక్యమే - సాయం
ఖననము చేసెదన్ - పాపపు బాట
మననము చేసెదన్ - దేవుని మాట
3. వ్యతిరేక ప్రతికూల - సేవా యాత్రలో
బలము - నీ వాక్యం
ఆశలన్నియు - అడుగంటినను
ఆశ నీ వాక్యం
అగ్ని వంటిది - దేవుని వాక్యం
అగ్నిబాణముల్ - ఆర్పివేసెదన్