నశించు ఆత్మలెన్నో (132)
నశించు ఆత్మలెన్నో - నా చెంతనేయుండగ
నా ప్రభువా నాకిమ్మయా - నీ హృదయ భారంబును

1. పాపంబుతో పెనగిన - భారంబుతో ఓడిన
శాపంబులో మునిగిన - ఆత్మలన్‌ జేరగా
నా ప్రభువా! నీ కొరకే - ప్రేమించి వారిని నడిపింతును

2. నీ‌ ఆత్మ నను నింపగ - నీ కృపలో బలమొందగ
నీ వశమై నేనుండగ - నాయందే నీవుండగ
నా ప్రభువా! నీ కొరకే - ప్రార్ధించి వారిని‌ నడిపింతును

3. కోతెంతో విస్తారము - పనివారు బహుకొంచెము
నీ పంటన్‌ కోసెడివారిన్‌ - పంపుము మా యజమానుడా
భారంబుతో పనిచేయన్‌ - నింపుము దేవా నీ దాసులన్
 0:00    
  0:00

Audio

 0:00    
  0:00

Track