నడిచెదన్ దేవా నేను నడిచెదన్ దేవా
నీ మార్గం నేనుండు చోటన్ సత్యం బోధించు బాటన్
నడిచెదన్ దేవా నేను నడిచెదన్ దేవా
1. నీవే మార్గము దేవా నీవే సత్యము
నీదు నామం పరిశుద్ధం నీదు జీవం పరిపూర్ణం
2. నాదు కుమ్మరి నీవే మంచి కాపరి
నీతో నిరతం సాగాలి, నీకు చేరువ కావాలి
3. నాదు జీవితం దేవా నీకే అంకితం
నేను నీలో ఎదగాలి నీదు ప్రేమను చాటాలి