దేవునితో జత పనివారము (117)
దేవునితో జత పనివారము - రయమున సాగెదము
సిలువను మోసి - శ్రమలు సహించి జయమని పాడెదము
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1. క్రీస్తే మనకు నాయకుడు - ప్రేమే మన మార్గము
యేసును చాటుచు - ఆత్మల వెదకుచు
ముందుకు సాగెదము ముందుకు సాగెదము #హల్లెలూయా#
2. మహిమ కిరీటమె బహుమానము - ఆశింపమిల నేదియు
నిందలు భరియించి - వాక్యము వెదజల్లి
యేసులో ఫలియింతుము యేసులో ఫలియింతుము #హల్లెలూయా#
3. చీకటి పొలమెంతో విస్తారము - పోరాట మధికము
యేసుని ధరియించి - వాక్యము చేబూని
సాతాను నోడింతుము సాతాను నోడింతుము #హల్లెలూయా#