దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసునే నా - మదిలో కోరుతా
ఎల్లప్పుడు యేసువైపు కన్నులెత్తి పాడుతా
పరమ తండ్రి నీదు మాట - బలముతోడ సాగుతా
1. మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా
మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడ జేరనా
2. ఎన్నడు ఎడబాయడు - నన్ను - విడువడు ఏ మాత్రము
ప్రభువే నాకు అభయము - భయ - పడను నేనేమాత్రము
3. దైవ వాక్యం - జీవవాక్యం - అనుదినంబు చదువుతా
ప్రభువు మాట - నాదుబాట - విభునితో - మాట్లాడుతా
4. పరిశుద్ధముగ అనుకూలముగా - జీవయాగమై నిలిచెదా!
సిలువ మోసి - సేవ చేయ - యేసుతోనే - కదులుతా