అర్పింతు దేవా - ప్రాణాత్మదేహం
నీ సేవ చేయగ - నీ మాట చాటగ అర్పింతు దేవా
1. నను నీకై జేసితివి - ననుకోరి చేరితివి
నను కొనగ నా కొరకై - క్రయధనము నిచ్చితివి
నను నీదు సొత్తుగజేసి - కృపచేత బ్రోచితివి
నను నీదు సంకల్పములో - స్థిరపరచి గాచితివి
అర్పింతు జీవితం - అంగీకరించుమా
యజమానుడా దేవా - సర్వాధికారివి
2. విద్యార్థి లోకంలో - నిను నేను సేవింపన్
బాధ్యతల నిచ్చితివి - భారంబు మోపితివి
శుద్ధికరించితివి - శుభవార్త నొసగితివి
ఉద్యోగ వరములతో - దీవెనలు నింపితివి
అర్పింతు జీవితం - నీ సేవచేయగా
యజమానుడా దేవ - సర్వాధికారివి
3. నీ వాక్యం ధ్యానింతున్ - బోధించి నేర్పింతున్
నీ వాక్యం పాటింతున్ - ప్రార్ధించి ప్రకటింతున్
నీ వాక్య సత్యాలే - సవాళ్ళు లోకంలో
నీ వాక్య భావాలే - బాధలకు ఔషధముల్
అర్పింతు జీవితం - నీ వాక్య సేవకై
యజమానుడా దేవ - సర్వాధికారివి