అంజూరపు చెట్లు పూయకుండినను
అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలియింపకను
ఓలీవచెట్లు కాయకను చేనిలోని పైరు పంటకు రాకపోయినను
గొర్రెలు దొడ్డిలో లేకున్నా - శాలలో పశువులు లేకున్నా
యెహోవయందానందము - నా దేవునిలో సంతోషము
ప్రభువగు యెహోవయే నాకు గల బలము
నాదు కాళ్ళను లేడి కాళ్ళగ చేయువాడు ఆయనే
ఉన్నతంబౌ స్థలములందున - నన్ను నడిపించున్
గొర్రెలు దొడ్డిలో లేకున్నా - శాలలో పశువులు లేకున్నా
యెహోవయందానందము - నా దేవునిలో సంతోషము