జీవితం విలువైనది (8)

  
జీవితం విలువైనది జీవితం
యవ్వనం చురుకైనది యవ్వనం
మదిలోన కలలు నిండి మనసంతా దిగులు ఉండి
లాగెను మనసు ఊగెను తూగెను బ్రతుకు సాగెను

1. ENJOY చేసే ఆశే ఉంది
మనస్సాక్షి CONTROL చేస్తూ ఉంది
ఎందుకు HURRY అంటూ ఉంది
సమయం కాదు WAIT చెయ్ అంది
ఓపిక నిగ్రహం అయ్యేపని కాదు
ఓర్పుగా నేర్పుగా ఉండాలని లేదు

2. ఆకర్షణలకు అదుపేముంది
ప్రేమే మోక్షం అనిపిస్తుంది
అందం బంధం కావాలంది
మదిలో ఘర్షణ మొదలయింది
లోకము మోసము మర్మం తెలిసింది
సత్యము జీవము మార్గం దొరికింది

3. యేసు క్రీస్తు ప్రేమామయుడు
ప్రాణంపెట్టిన కరుణామయుడు
మరణం గెలిచిన మృత్యుంజయుడు
బ్రతుకునుమార్చే ప్రియరక్షకుడు
కన్నతండ్రిలా ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు
మోక్షరాజ్యపు అర్హత అడిగితే ఇస్తాడు

జీవితం విలువైనది జీవితం
యవ్వనం చురుకైనది యవ్వనం
అర్పించు నీదు హృదయం సమర్పించు జీవితమును
మేలుకో ఓ మిత్రమా అందుకో ఆనందము
0:00
0:00

Audio

0:00
0:00

Track