ప్రేమకై తపియించే ఓ స్నేహితుడా
నిజప్రేమలో తరియించుము నా చెలికాడా
తిరిగావు ఈ లోకపు ప్రేమ వేటలో
విసిగావు మోసాల ముళ్ల బాటలో.. ముళ్ల బాటలో
ప్రేమ మధురం – ప్రేమ అమరం
ప్రేమా స్వరూపునిలో...
ప్రేమ నిరతం – ప్రేమ సత్యం
ప్రేమామయ యేసునిలో..
1. అందాల ఆకర్షణలే – హృదిని ప్రేమసంఘర్షణలై
కుర్రకారు కవ్వింపులే- గుండె నిండ క్రొత్త ఆశలై
కలలెన్నో కన్నావు వలలెన్నో వేశావు
మోసంలో చిక్కావు – మైకంలో పడి పోతివా
కన్నవారి ప్రేమను మరచి కపటములో జీవించెదవా
ప్రేమ మధురం...
2. నీ నిజ స్థితినే మరచావు – బ్రతుకు నటనగా మార్చావు
పైరూపము నాశించావు- పాపములో కొనసాగావు
ప్రేమ విఫలమైపోయి – జీవితాశ కోల్పోయి
బ్రతుకు భారమైపోయి- ఉరి యొద్దకు పరుగెత్తెదవా
క్షణికకాల నిర్ణయమేల ఒక్క క్షణము యోచించుమా
ప్రేమ మధురం...
3. నిన్ను నన్ను ప్రేమించాడు పరమునుండి దిగి వచ్చాడు
కలుషములను కడుగుట కొరకు కలువరిలో శ్రమ నొందెను
మన స్థానములో నిలిచి పాపపు వెల చెల్లించి
మనకొరకై మరణించి పాపిని ఇల రక్షించెను
మదిలో ప్రభుకి చోటియ్యుమా మధురప్రేమ పొందుటకొరకు
ప్రేమ మధురం...