నేడంటే నేడే, రేపంటే రేపే
ఇపుడైనా ఎపుడైనా సుఖమును ఆస్వాదించొచ్చు
నీవైనా ఎవరైనా బ్రతుకులో ఆనందించొచ్చు
అయితే ఒక మాట, తెలిసికో ఈ సంగతి
మన మరణం ఎప్పుడో ఎవరూ ఎరుగరు సోదరా
ఆపై ఎక్కడ ఉంటామో నీకూ తెలియదు సోదరి
1. ఆడిపాడి అలిశావు, తోడే లేక ఉన్నావు
ఏడకు వెళ్ళిన ఏం లాభం? దొరకదు నీకు సంతోషం
నీ తోడు ప్రభు యేసే, యేసుని నేడే తెలిసికో
నీతోనే ఉంటాడు యేసుని నేడే కలుసుకో
తెలిసికో, కలుసుకో
2. ఎంతోమంది స్నేహితులు చుట్టూ ఉన్నా ఒంటరినా
కాంతల ప్రేమను కోరావే, వింతగా బాధలు పడ్డవా
ఎంతోమంది స్నేహితులు చుట్టూ ఉన్నా ఒంటరివా
పురుషుల ప్రేమను కోరానే, తరగని బాధలు పడ్డావా?
ఎంతో గొప్ప ప్రేమికుడు యేసుని ప్రేమను తెలిసికో
చెంతన యేసు నీకుంటే, స్వాంతన ఉంది కలుసుకో
తెలిసికో, కలుసుకో
3. సిలువలో ప్రాణం పెట్టాడు, ప్రేమకు అర్థం చెప్పాడు
మరణం గెలిచి లేచాడు, దైవం తానే అన్నాడు
నరులను స్నేహితులన్నాడు, యేసుని స్నేహం తెలిసికో
నిత్య రాజ్యం ఇస్తాడు, యేసుని నేడే కలుసుకో
తెలిసికో, కలుసుకో