యౌవనుడా ( ఓ యువతీ) – నీ యౌవన కాలమున సంతోషపడుచున్నావా -2
నీ ఇష్టమైన కోరిక చొప్పునను నీ హృదయ వాంఛలతో ప్రవర్తించుచున్నావా
ఒక తీర్పు దినము ఉన్నదని – నీవు ఎరుగుదువా-2
1. లోకపు ఆశలకు – (ఈ) లోకపు ఆకర్షణలకు –
నీవు లోబడి జీవించినచో (నీకు) తీర్పుంటుందని తెలిసికో – 2
2. ఈ లోక ప్రేమలో – స్వార్థం ఉందని ఎరుగవా -2
మోహపు చూపే వ్యభిచారమని (ప్రభు) యేసు చెప్పెగదా – 2
3. పాపుల రక్షణకై – ప్రభు యేసు మరణించె – 2
పాపములన్ని ఒప్పుకొని మారుమనస్సు పొందుమా!
నీ పాపములన్ని ఒప్పుకొని ప్రభు యేసు చెంతకు చేరుమా..