యేసునందే జీవితం యేసుతోనే భవితవ్యం
యేసునందే భద్రత - యేసులో నిజ ఆనందం
నేస్తమా ఇది నీ కోసమే తెలిసికో
నిజ జీవిత రహస్యం
1. ఆశలు తీరని జీవితం గమ్యం లేని ప్రయాణం
తీరలేదే నీ దాహం
శాంతికై నీ ప్రయాసం పాపముతో నీ సంబంధం దుఃఖము అది ప్రమాదం
నీ జీవితంలో సమస్యలే – సుడి గుండాలే
నీ యవ్వనంలో తప్పులే - చెడు వ్యసనాలే
అ.ప. ఒంటరి తనము నిరాశలో యేసే నీ తోడై
రక్షకుడై నిను ప్రేమిస్తూ - నీకై నిలుచున్
2. గుర్తింపుకై నీ ఆరాటం - విజయముకై నీ పోరాటం భారమయ్యింది యవ్వనం
దొరకలేదు జీవిత అర్ధం అలసి పోయింది నీ హృదయం ఆగిపోవాలనే ప్రయత్నం
సృష్టికర్తతోనే సమస్యలన్నీ - తీరునులే నూతన జీవితం
యేసులో అది సాధ్యమే 'ఒంటరి తనము'
3. యేసుని జననం ప్రత్యేకం - పాపము లేని జీవితం
శ్రమలను పొందిన త్యాగము
మరణం గెలిచిన నిజ దైవం
క్షమించుటే తన నిర్ణయం
మార్గము – సత్యము – జీవము - 2
నీతో నడిచే - నిత్యుడైన దేవుడే
అంగీకరిస్తే జీవమే - నిత్య జీవమే 'ఒంటరి తనము'