దేవుడు మనకు తొడుండును (2)

  
దేవుడు మనకు తొడుండును
లోకమునెంతో ప్రేమించెను
మహిమ భాగ్యమునే విడిచెను
మానవునిగా జన్మించెను
నీ కొరకే నా కొరకే యేసు పుట్టెన్
నీ కొరకే నా కొరకే భువికి వచ్చెన్

1. తానే సృష్టించెను మనుష్యులన్
    దారి తొలగెను ప్రజలందరున్
    తిరిగి తనతో కలసియుండన్
    రక్షణ మార్గము నేర్పరచెను “నీకొరకే“

2. నీదు శిక్షను భరియించెను
    నీకు రక్షణ కలిగించెను
    నీదు పాపం ఒప్పుకొనుము
    శాప భారం తొలగించును “నీకోరకే”

3. నాదు హృదయము అర్పించగా
    వారసునిగా నను జేసెను
    చింతలన్నీ తొలగజేసి
    సంతసముతో నను నింపెను “నీ కొరకే“
0:00
0:00

Audio

0:00
0:00

Track