సంతోషమే సంతోషమే నాకు కావాలి
ఆనందమే ఆనందమే నేను పొందాలి
హృదిలోన సంతోషం కలగాలని
మదిలోన ఆనందం నిలవాలనే
ఆశ నెరవేరునా ?
నా కలలు ఫలియించునా?
చీకటి వీధులలో నీటుగా నడిచితివి
లోకపుటుచ్చులలో – శోకము జూచితిని
హంగుల వేషంతో రంగుల వలయంలో
నింగికి నేనెగిరి – నేలను రాలితినే
తెలియునా నీకు ఓ మానవా – 2
యేసు పాపుల రక్షకుడు అని
యేసుని నమ్మిన మోక్షమని
తెలియునా నీకు ఓ మానవా – 2
ఓరన్నా – ఓరన్నా
యేసుకు సాటి వేరే లేరన్నా – లేరన్నా
యేసే ఆ దైవం – చూడన్నా “ 2”
చరిత్రలోనికి వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా
మహిమలు ఎన్నో చూపాడన్నా
మార్గం తానే అన్నాడన్నా
అద్వితీయుడు ఆది దేవుడు
ఆదరించును ఆదుకొనును
మనిషిగ మారిన దేవుడేగా
మరణం పాపం తొలగించెను
ఓరన్నా – ఓరన్నా
యేసుకు సాటి వేరే లేరన్నా – లేరన్నా
యేసే ఆ దైవం – చూడన్నా
సిలువలో మరణించి – లేచెను, తిరిగిలేచెను
పాపము శాపమును – మోసెను, బాపివేసెను
మరణపు మార్గమును – వీడుము, వేగవీడుము
యేసులో జీవమును – కోరుము, నీవు కోరుము
ఎంత పాపినైనగాని – యేసు చేర రమ్మనే
యేసు చెంత చేరువాని – త్రోసివేయజాలడు – 2
నీ పాప జీవితం – ప్రభుయేసు మార్చగా
నీ చెంత చేరి నిన్ను – పిలుచు చుండెగా
విలువైన రక్తధార – ప్రేమతోడ గార్చెను
ఆ ప్రేమమూర్తి పిలుపు నాలకింపజాలవా
ఆ జాలి ప్రేమను గమనింపకుందువా
ఆ దివ్య ప్రేమను – గ్రహియింపకుందువా
ఓ సోదరా, ఓ సోదరీ ఆ ప్రేమమూర్తి యేసు దరిచేరవా
ఆ జాలి ప్రేమను గమనింపకుందువా
ఆ దివ్య ప్రేమను – గ్రహియింపకుందువా